నాకు, రసమయికి రాజకీయాలు తెలియవు : బాలకృష్ణ

-

రసమయి బాలకిషన్​కు.. నాకు రాజకీయాలు తెలియదు. ఆయన్ను తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా నియమించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అని ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. జగపతిబాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్​దాస్, విమలా రామన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రుద్రంగి ప్రీ రిలీజ్ ఈవెంట్​కు హాజరయ్యారు. ఈ సినిమాను అజయ్ సామ్రాట్ తెరకెక్కించగా.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించారు. జులై 7న థియేటర్లలో విడుదల కానుంది.

‘‘రసమయి బాలకిషన్‌ నా సోదరుడిలాంటివాడు. నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ రాజకీయాలు తెలియదు. ఆయన్ను తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా నియమించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కథ, పాత్రల్లో ప్రేక్షకుల్ని లీనమయ్యేలా చేసే అరుదైన చిత్రాల్లో ‘రుద్రంగి’ ఒకటి. తన కోసమే ప్రేక్షకులు థియేటర్లకి వచ్చేలా జగపతి బాబు సినిమాలు చేశారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మనుగడ కోసం మేం పనిచేస్తున్నాం. ’’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news