రైతు బంధు అందక 48 లక్షల మంది రైతులు అల్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే… కేంద్రంలో బీజేపీ ఎంపీలు ఎక్కువగా గెలవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పులెలా తీరుస్తారు? అని ప్రశ్నించారు. రైతు బంధు అందక 48 లక్షల మంది రైతులు అల్లాడుతున్నరు. కేంద్ర సాయం లేకుంటే వాటినెలా తీరుస్తారు? తెలంగాణ రాష్ట్రానికి అప్పులు రావాలన్నా, అధిక నిధులు రావాలన్నా మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.
రాహుల్ ప్రసన్నం కోసమో, అధిష్టానం ఒత్తిడి తోనే బీజేపీపై విమర్శలు చేస్తే అది తెలంగాణ రాష్ట్రానికే నష్టమనే వాస్తవాన్ని గమనించాలని కోరారు . తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి పనిచేస్తే తెలంగాణకు అత్యధిక నిధులు తీసుకొచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎందుకంటే మోదీగారు ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తారు.. ఎన్నికల తరువాత రాష్ట్రాల అభివ్రుద్ధికే అత్యధిక ప్రాధాన్యతనిస్తారన వెల్లడించారు. కేసీఆర్ కుట్రలను డేగ కన్నుతో గమనించి జాగ్రత్త పడాలని కాంగ్రెస్ నేతలకు సూచిస్తున్నా… బీజేపీ ఆ కుట్ర రాజకీయాల జోలికి వెళ్లదు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మా పార్టీ ముందుంటుందన్నారు.