కేంద్రమంత్రిని చేస్తానంటే.. వద్దన్నా: బండి సంజయ్

-

కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కీలక వాక్యాలు చేశారు. ‘కరీంనగర్ అభివృద్ధికి రూ. 9 వేల కోట్లు తెచ్చా. ఇది నేను చేసిన తప్పా? నాపై విమర్శలు ఎందుకు? నాకు కేంద్రమంత్రి పదవి ఇస్తానని ప్రధాని మోదీ అంటే….వద్దని చెప్పి కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కాబట్టే…. నేను ఓడిపోవాలని కేసీఆర్ చూస్తున్నారు’ అని వాక్యానించారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కాషాయ పార్టీ కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు. కులాలు,మతాలు పక్కన పెట్టి ఐక్యంగా పోరాడాలన్నారు. అవినీతి చేసిన నేతలను జైలుకు పంపుతామని తెలిపారు. డిసెంబర్ 03న సంబురాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. తెలంగాణ ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కుటుంబ పాలన చేస్తున్నాయని.. కుటుంబ పాలన పోయి.. ప్రజల పాలన రావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news