తెలంగాణ ఎన్నికల్లో బిఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నియోజకవర్గాలలో సిరిసిల్ల ఒకటి. ఎందుకంటే ఇది కేసీఆర్ తనయుడు కేటీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గం. ఇప్పటికీ నాలుగు సార్లు గెలిచిన కేటీఆర్ ఈసారి కూడా గెలవాలని పట్టుదలతో ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి కేకే మహేందర్ రెడ్డి పోటీ చేస్తుండగా, బిజెపి నుంచి రాణీ రుద్రమ పోటీ చేస్తున్నారు. కేకే మహేందర్ రెడ్డి కి ప్రతిసారి ఓడిపోతున్నడని సానుభూతి తప్ప మరే విధమైన అనుకూలించే అంశాలు లేవు. ఎప్పుడు హైదరాబాదులోనే ఉంటాడని, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడని టికెట్ వచ్చిన తర్వాత మాత్రమే వస్తాడని విమర్శలు ఉన్నాయి.
బిజెపి అభ్యర్థి రాణి రుద్రమయితే టికెట్ ప్రకటించే వరకు అసలు సిరిసిల్ల ఆమెకు తెలియదు. ఈమె నాన్ లోకల్. ఒక మాటలో చెప్పాలంటే సిరిసిల్లలోని బిజెపి నేతలు కూడా ఎవరో ఈమెకు తెలియదు. వారితో పరిచయాలు లేవు. అలాంటి అభ్యర్థిని సిరిసిల్ల ప్రజలు ఆదరిస్తారా అంటే లేదనే సమాధానమే వస్తుంది.
ఇక బిఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ గురించి చెప్పాలంటే ఆత్మహత్యల కు ప్రసిద్ధి చెందిన నియోజకవర్గం గా చెప్పుకునే సిరిసిల్లను అభివృద్ధి పథంలో నడిపించారని చెప్పవచ్చు. చేనేత కార్మికులకు అండగా ఉంటూ, బతుకమ్మ చీరలతో వారికి ఆదాయ వనరులను అందించారని చెప్పవచ్చు. రాష్ట్ర మంత్రిగా, బిఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఉంటూ కూడా సిరిసిల్లను అగ్రగామిగా నిలపడానికి కేటీఆర్ తన శాయ శక్తుల కృషి చేశాడని చెప్పవచ్చు. అందుకే ఈసారి కూడా సిరిసిల్ల ప్రజలు కేటీఆర్ కు జై కొడుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక్కడ ఆయన గెలుపుపై కాదు..మెజారిటీ పైనే లెక్కలు నడుస్తున్నాయి.