కరీంనగర్ నగర ప్రజలకు బండి సంజయ్ శుభవార్త చెప్పాడు. కరీంనగర్ తీగలగుట్టపల్లి వద్ద LC నం.18 నాలుగు లైన్ల ఆర్వోబి నిర్మాణానికి ₹154.74 కోట్ల మంజూరుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని…ప్రకటించారు బండి సంజయ్.
ఆర్ఓబి విషయంలో కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మొదటగా 50-50% తర్వాత 75-25% వాట కింద రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొన్న తర్వాత నిధులు ఇస్తామని ఈ అర్వోబీ నిర్మాణానికి ఒప్పుకున్న నేపథ్యంలో నేను దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే బోర్డులో 100 కోట్ల నిధులు మంజూరు చేస్తే, గత సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వం GAD డ్రాయింగ్స్ అప్రూవ్ చేయకుండా కాలయాపన చేసిందని ఫైర్ అయ్యారు.
పైగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్న 75% నిధులు ఇవ్వకుండా ఆర్వొబి నిర్మాణానికి అడ్డుకట్ట వేసి, కరీంనగర్ ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇలా కాలయాపన చేయడంతో నేను చేస్తున్న విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ₹154.74 కోట్లు సేతు బంధన్ కింద నిధులు మంజూరు చేసిందని వివరించారు.