బడ్జెట్ అంతా డొల్ల – బండి సంజయ్

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల, ఎలక్షన్ స్టంట్ ను తలపిస్తుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ అంతా అంకెల గారడీ అని విమర్శించారు. ఈ బడ్జెట్ గందరగోళంగా ఉందని, ప్రజాస్పందన కరువైన బడ్జెట్ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే.. సరుకు లేదు, సంగతి లేదు, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, శుష్కప్రియాలు, శూన్య హస్తాలు అని ఎద్దేవా చేశారు.

అంతా వట్టిదే.. డబ్బా బడ్జెట్.. బబ్రాజమానం భజగోవిందం అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. ఎన్నికల మేనిఫెస్టో తో పాటు పలు సందర్భాలలో కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటిని చివరి ఏడాదైనా నెరవేరుస్తారని ఆశించిన ప్రజలకు మొండి చేయి చూపించారని అన్నారు. బడ్జెట్ లో కేటాయించిన నిధులకు, ఆచరణలో ఖర్చు చేస్తున్న నిధులకు పొంతనే లేదని అన్నారు.

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?