BREAKING : బండి సంజయ్, ఈటల అరెస్ట్..

-

TSPSC పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్ష చేపట్టారు. హైదరాబాద్​లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గన్​పార్క్ వద్దకు చేరుకున్న బండి సంజయ్.. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

అనంతరం నిరసన దీక్ష ప్రారంభించారు. మరోవైపు గన్​పార్కు వద్దకు పోలీసులు చేరుకున్నారు. బండి సంజయ్ దీక్షకు అనుమతిలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో వారిని అక్కడి నుంచి వెళ్లమని చెప్పారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ తరుణంలోనే.. అక్కడి చేరుకున్న పోలీసులు.. బండి సంజయ్‌ ని అరెస్ట్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news