కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా : బండి సంజయ్

-

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం కానీ హద్దు మీరొద్దు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. BRS వ్యవహారం నచ్చకనే ప్రజలు బుద్ధి చెప్పారు. ఏది పడితే అది మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డు వస్తుంది. ఎవరి భాష ఏంటీ , ఎవరి సంస్కారం ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. నోటీసులకు నోటీసులతోనే సమాధానం చెప్తా. కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తా అని బండి పేర్కొన్నారు.

అలాగే కేటీఆర్ నీ అయ్య, నీ కుటుంబ సభ్యులు వచ్చి డ్రగ్స్ పై సంబంధం లేదని గుండె మీద చేయి వేసుకొని ప్రమాణం చేయమని చెప్పాను. పార్టీలు మారిన వాళ్ళు వ్యభిచారులు అయితే నీ అయ్యది ముందు ఏ పార్టో కేటీఆర్ చెప్పాలి. పార్టీ మారిన వాళ్ళు వ్యభిచారులు అయితే నీ అయ్యను ఏ పేరుతో పిలవాలో కేటీఆర్ చెప్పాలి అన్నారు. అలాగే దీపావళి వరకు అరెస్టు చేస్తామని కాంగ్రెస్ అంటుంది. అరెస్టు చేస్తే మీ అంతు చూస్తామని BRS అంటుంది. రెండు పార్టీలు ఒక్కటే, దోందు దొందే. నువు కొట్టినట్టు చేయు, నేను ఏడ్చినట్టు చేస్తా అన్నట్టు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేస్తున్నాయి అని బండి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news