ఆ ఎమ్మెల్యేలు పరిస్థితి బ్రోకర్ల కంటే హీనంగా మారింది : కౌశిక్ రెడ్డి

-

జగిత్యాలలో స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హత్య చేయించారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్తున్నారు. జగిత్యాల ఎస్పీ ఎమ్మెల్యే సంజయ్ పై ఎందుకు మర్డర్ కేసు నమోదు చేయలేదు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం సంజయ్ మారు గంగారెడ్డిని తన అనుచరుడితో హత్య చేయించారు. ఎమ్మెల్యేపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలో హత్యా రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.

అలాగే నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎమ్మెల్యే సంజయ్ అంటున్నారు. గాంధీ భవన్ లో జరిగే కాంగ్రెస్ మీటింగ్ కు ఎమ్మెల్యే ఎందుకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. BRS పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు పరిస్థితి బ్రోకర్ల కంటే హీనంగా మారింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేయడం లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాక తప్పదు. రాహుల్ గాంధీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news