తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ కుటుంబం మాత్రమే లాభపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీ మాత్రమే పదేళ్ల ఆవిర్భావ ఉత్సవాలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో ‘ఖేలో భారత్ – జీతో భాగ్యనగర్’ పేరుతో బీజేపీ నిర్వహిస్తున్న క్రీడా పోటీలను బండి వీక్షించారు. క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా క్రీడాకారులతో కలిసి ఆయన సందడి చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు గుప్పించిన బండి సంజయ్.. తెలంగాణ ఉద్యమకారులను రోడ్డున పడేశారన్నారు. కేసీఆర్ కుటుంబం సంపాదించిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో పరిస్థితులకనుగుణంగా అక్కడ ఎన్నికల ఫలితాలొచ్చాయని రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకు కేసీఆర్ అంతర్గతంగా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారని ఆరోపించారు.
“సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించటం లేదు. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా.. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తాం. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. కే”- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు