ఎన్ని యాగాలు చేసినా ఏ దేవుడు నిన్ను క్షమించడని సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జగిత్యాలలో పాదయాత్ర చేసిన బండి సంజయ్ ఈ సందర్భంగా హాట్ కామెంట్స్ చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభగా కరీంనగర్ లో భారీ బహిరంగ సభ పెడుతున్నామని.. జెపి నడ్డా ముఖ్య అతిధిగా పెద్ద ఎత్తున సభ జరుపుతామన్నారు.
BRS పేరితో మరలా కుట్ర చేస్తున్నాడని.. సమైక్య నినాదాం తెచ్చి లబ్ది పొందాలని చూస్తున్నాడని ఆగ్రహించారు. కేసీఆర్ చెల్లని రూపాయి.. రాజశ్యామల యాగం చేసినా ఏ దేవుడు క్షమించడన్నారు. స్వార్థం కోసము యాగం చేస్తే ఇంట్లో చేసుకోవాలని.. ఢిల్లీలో యాగం చేసేటప్పుడు దేవుడి సాక్షిగా తెలంగాణలో ఏమి చేసినవో చెప్పు అని ఫైర్ అయ్యారు. కెసిఆర్ చేసే యాగాలు ఆయనకే తిప్పి కొడతాయని.. కవిత విచారణకు సహరికరించాలి అని మేము అంటున్నామన్నారు బండి సంజయ్.