రాజాసింగ్ పై పోటీ చేసే దమ్ము కేటీఆర్‌ కు ఉందా ? – బండి సంజయ్‌

-

రాజాసింగ్ పై పోటీ చేసే దమ్ము కేటీఆర్‌ కు ఉందా ? అని సవాల్‌ చేశారు బండి సంజయ్‌. ముఖ్యమంత్రి కెసిఆరా, కేటిఆరా….కెసిఆర్ కు దమ్ముంటే… కెటిఆర్ ముఖ్యమంత్రి అని ప్రకటించాలని సవాల్‌ చేశారు. కెటిఆర్ ముఖ్యమంత్రి అని ప్రకటిస్తే బిఆర్ఎస్ లో ఎవరూ ఉండరూ అంటూ హాట్‌ కామెంట్స్‌ చేశారు. రైల్వే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరని వివరించారు.

బిఆర్ఎస్ ప్రభుత్వం మాట డ్యామెట్ కథ అడ్డం తిరిగింది చందంలా తయారు అయ్యిందని.. ఆర్టీసి కార్మికులు వాస్తవాలు గ్రహిస్తున్నారని వెల్లడించారు. 15-20 వేల కోట్లు అర్టీసి వి వాడుకున్నారు. ఆర్టీసీ విలీన బిల్లులో వాటి గురించి లేదు..కార్మికుల సీసీఎస్ డబ్బులు 4500 కోట్లు, పీఎఫ్ డబ్బులు 9 వేల కోట్లు వాడుకున్నారు… అవి ఎవరిస్తారని ప్రశ్నించారు. లక్ష కొట్ల అర్టీసి ఆస్తులని కొల్లగొట్టె ప్రయత్నం చేస్తున్నారు….కరీంనగర్, ఆర్ముర్ లో ఇప్పటికే ఆర్టీసీ ఆస్తులను లీజు పేరుతో కొల్లగొట్టారని ఆగ్రహించారు బండి సంజయ్‌.

Read more RELATED
Recommended to you

Latest news