హైదరాబాద్ లో పాకిస్తాన్ జెండాలు అమ్ముతున్నారు..ఆ షాపులపై దాడులు చేస్తాం – బండి సంజయ్‌

-

హైదరాబాద్ లో పాకిస్తాన్ జెండాలు అమ్ముతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌. ‘‘షాపింగ్ మాల్స్ పేరుతో పాకిస్తాన్ జెండాలు తయారు చేసి పెడతారా? షాపింగ్ మాల్స్ అడ్డా చేసుకుని లవ్ జిహాద్ పేరుతో హిందు యువతులను మోసం చేసే కుట్రలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారు? అట్లాంటి షాపింగ్ మాల్స్ కు అనుమతి ఎట్లా ఇచ్చారు? తక్షణమే ఆ షాపింగ్ మాల్స్ ను మూసివేయాలి. లేనిపక్షంలో ఉరికించి ఉరికించి కొడతాం.’’ అంటూ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు.

నిన్న హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో పాకిస్తాన్ జెండాలను విక్రయిస్తున్నట్లు వార్తలు రావడంతో బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్దారు. ‘‘ అట్లాంటి షాపింగ్ మాల్స్ ను పెట్టినోళ్లకు బుద్దిలేదు. అనుమతి ఇచ్చినోళ్లకు, ప్రారంభించినోళ్లకు సిగ్గు లేదు…’’ అంటూ దుయ్యబట్టారు. ప్రపంచకప్ క్రీడల్లో భాగంగా పాకిస్తాన్ పై భారత్ విజయ దుందుభి మోగించిన నేపథ్యంలో కరీంనగర్ లో క్రికెట్ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు టవర్ సర్కిల్ లో బాణా సంచా పేల్చి సంబురాలు చేసుకున్నారు. బండి సంజయ్ కుమార్ స్వయంగా బాణా సంచా పేల్చి మిఠాయిలు తిన్పిస్తూ సంబురాల్లో పాల్గొన్నారు. కొందరు షాపింగ్ మాల్స్ పేరుతో హైదరాబాద్లో పాకిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తున్నారు…అటువంటి షాపింగ్ మాల్స్ పై దాడులు చేస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news