బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 2వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసే ప్రయత్నం చేశారంటూ హాట్ కామెంట్స్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు లో కాంగ్రెస్ దేశ సంపదను దోచుకునేందుకు సిద్ధం అయిందన్నారు. ఈ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదని.. 2011లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సీబీఐ దర్యాప్తు మొదలైందని గుర్తు చేశారు. ఆ సమయంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ కేసులో బెయిల్ పొందారని తెలిపారు.
ఈ కేసుతో బీజేపీ కి ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ దేశ చట్టాలు సోనియా గాంధీకి రాహుల్ కి వర్తించవా..? అని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారు బయట స్వేచ్ఛ గా తిరుగుతున్నారని.. న్యాయ స్థానాలపై ప్రజలకు నమ్మడం ఉండటం లేదని వెల్లడించారు. ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసు పై కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించిన సంగతీ తెలిసిందే.