తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై పారిశ్రామిక వేత్తలకు వీడియో ప్రజేంటేషన్ ఇచ్చారు. లైఫ్ సైన్సెస్, ఈవీఎస్, టెక్స్ టైల్స్, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులను సీఎం ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ పారిశ్రామిక విధానాలు ఆకట్టుకున్నాయని తోషిబా ఎం.డీ. హిరోషి పురులా ప్రశంసించారు.
ఇక ఇప్పటికే కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదరగా.. తాజాగా మరో దిగ్గజ కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తోషిబా రుద్రారంలో రూ.562 కోట్ల పెట్టుబడి తో కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో టీటీడీఐ సర్జ్ అరెస్టర్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. జీఐఎస్ తయారీ కోసం ఫ్యాక్టరీలను టీటీడీఐ అప్ గ్రేడ్ చేస్తోంది. రుద్రారంలో మూడవ ఫ్యాక్టరి ఏర్పాటుతో పరిశ్రమల విస్తరణ జరుగనుంది.