కేటీఆర్ చుట్టూ… ఈగో Wifi లెక్క ఉంటది – బండ్ల

-

Bandla Ganesh: కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై లెక్క ఉంటుందని… కేటీఆర్..ఇంకా భ్రమల్లో ఉన్నాడని ఫైర్ అయ్యారు కాంగ్రెస్‌ నేత, నిర్మాత బండ్ల గణేష్. మానసిక క్షోభ లో ఉన్నాడని… పగవాడికి కూడా కేటీఆర్ లాంటి పరిస్థితి రావద్దని సెటైర్లు పేల్చారు కాంగ్రెస్‌ నేత, నిర్మాత బండ్ల గణేష్. రాబోయే రోజుల్లో కేటీఆర్ కి కష్టం తప్పదని…17 సీట్లలో పోటీ చేసే వాళ్ళ పేర్లు చెప్పండి అని కేటీఆర్ పై ఫైర్‌ అయ్యారు. పోటీ చేయడానికి ఎవరు రావడం లేదు.. కేటీఆర్ ఫోన్ వస్తే భయపడుతున్నారన్నారు కాంగ్రెస్‌ నేత, నిర్మాత బండ్ల గణేష్.

bandla ganesh counter to ktr

ఏపీ మంత్రి రోజా ఓ ఐటమ్ రాణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న ఓ ప్రముఖ ఛానెల్‌ లో సీఎం రేవంత్‌ పై రోజా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఓ జాక్‌పాట్ సీఎం.. మంత్రి రోజా కామెంట్స్ చేశారు. అయితే.. రోజా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేత, నిర్మాత బండ్ల గణేష్ కౌంటర్‌ ఇచ్చారు. రోజా డైమండ్ రాణి…. ఆక్సిడెంట్ సీఎం.. ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు అంటూ జగన్‌ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఫైటర్ అని.. రోజా లాగా పులుసు వండి పెడితే పదవులు రావని చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news