వైరల్ : నిమజ్జనం చేసేటప్పుడు జాగ్రత్త ఉండండి.. లేదంటే ?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల లో గణపతి పండగ హడావిడి మొదలైన సంగతి తెలిసిందే. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా… గణపతి ఉత్సవాలకు కాస్త ఆటంకం ఏర్పడింది. అయితే ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో…. గణేష్ ఉత్సవాలను చాలా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు ప్రజలు. డిజె సౌండ్ లు, భజనలతో గణపతి మండపాలు హోరెత్తుతున్నాయి. ఇక అటు…. గణపతులను నిమజ్జనం చేసేటప్పుడు రూల్స్ పాటించాలి అంటూ హెచ్చరిస్తున్నారు.

Lord Ganesha , Ganesh Festival

వినాయకుడి నిమజ్జనం పేరుతో… ప్రకృతి ని నాశనం చేయకూడదని కోర్టులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మట్టి వినాయకుల…. సంఖ్య పెరిగింది. ఇక ఇదిలా ఉండగా…  ఇంకా కొందరు భక్తులు… గణపతి విగ్రహాలను నిమజ్జనం చేస్తూనే ఉన్నారు. ఈసారి భారీ వర్షాలు పడడంతో చెరువులు కుంటలు అన్ని పూర్తిగా నిండాయి. ఈ నేపథ్యంలోనే కొందరు ఉత్సాహంతో చెరువులో దగ్గరకు వెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. అయితే ఇలాగే ఓ వ్యక్తి.. స్థానిక చెరువు దగ్గరికి వెళ్లి నిమజ్జనం చేస్తుండగా… బొక్క బోర్లా పడ్డాడు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. దేవుని కోసం వెళితే ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు నెటిజన్లు. కాబట్టి నిమజ్జనం సమయంలో ఆడబిడ్డ లేకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడుతున్నారు.