Tourists Rush To Bogatha Water Fall: బోగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది. తెలంగాణ నయాగరాగా పేరు గాంచిన బోగత జలపాతానికి వరద పోటెత్తింది. ములుగు జిల్లా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి బోగత జలపాతాల వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవహిస్తుంది. ఈ తరుణంలోనే.. బోగత జలపాతం పరవళ్లు తొక్కుతోంది.
ఇక అటు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గురువారం రోజున 20 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఇవాళ ఉదయానికి 25 అడుగులకు చేరుకుంది. రాష్ట్రంతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి.. 59 వేల 330 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీత వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ గోదావరిలో కలుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాల వరకు నీరు చేరుకుంది.