బడ్జెట్‌పై నేటి నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి సన్నాహక సమావేశాలు

-

మరికొద్ది రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఓటాన్ అకౌంట్ గడువు జులై నెలాఖరుతో పూర్తి కానుండటంతో ఆలోగా పూర్తిస్థాయి బడ్జెట్​ సర్కారు ఆమోదం పొందాల్సి ఉంది. ఇందుకోసం వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలోనే పూర్తి స్థాయి బడ్జెట్ కోసం ఆర్థికశాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకొంది. వాటి ఆధారంగా శాఖల వారీగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇవాళ్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. వాస్తవానికి సన్నాహక సమావేశాలు గతంలోనే జరగాల్సి ఉండగా వివిధ కారణాల రీత్యా వాయిదా పడ్డాయి. ఇవాళ వ్యవసాయ, అనుబంధ శాఖలపై భట్టి విక్రమార్క సమీక్ష జరపనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత అధికారులతో భట్టి సమావేశమై ప్రతిపాదనలను సమీక్షిస్తారు. ఆ తర్వాత మిగతా శాఖల సమావేశాలు కూడా జరుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news