BRSనను బంగాళాఖాతంలో కలపాలని కాంగ్రెస్ అగ్రనేత, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో పనులు జరుగడం లేదన్నారు.
మోసం చేయడం, మాటలు చెప్పడం బీఆర్ఎస్‌కు అలవాటు అయిందని ఫైర్ అయ్యారు. తెలంగాణ వస్తే జీవితాలు బాగు పడతాయని భావించారు.. కానీ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రజల జీవితాల్లో మార్పులు రావాలంటే ప్రజలు ఎన్నికల సమయంలో ఆలోచించాలని కోరారు. ప్రజల తెలంగాణ గెలవాలి.. ఈ రాష్ట్రంలో వెలుగు నిండాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చారు మల్లు భట్టి విక్రమార్క. ముఖ్యంగా దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. యువత ఆత్మహత్యలకు బీఆర్ఎస్ సర్కారు కారణమవుతోందని స్పష్టం చేశారు. దొరల తెలంగాణ, తెలంగాణ మధ్య జరుగుతున్న యుద్ధం ఇదన్నారు.