భట్టి విక్రమార్క: సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు … !

-

తెలంగాణాలో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి సమయం చాలా తక్కువగా ఉంది. ఈ ఎన్నికలో అధికార BRS తో పాటు, బీజేపీ, కాంగ్రెస్ లు ప్రధానంగా గెలవడానికి ఛాన్సెస్ ఉన్న ప్రధాన పార్టీలు అని చెప్పాలి. ఇప్పటికే సీట్ల పంపకం మరియు ఎన్నికల వ్యూహాల గురించి చర్చలు మొదలయ్యాయి. అందులో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ… నేను చేసిన పాదయాత్రలో చాలా సమస్యలను గమనించానని … కొన్ని చోట్ల నీళ్ళకు కూడా సమస్యగా ఉందని ప్రజలు మొరపెట్టుకున్నట్లు భట్టి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల కోట్ల అప్పులో ఉందని ఆరోపించారు. ఈ వరదల సమయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. ఇక ఈయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుందని ప్రజలు అంతా నమ్ముతున్నారని తెలిపారు, అందుకే బీజేపీ మరియు BRS ల నుండి చేరికలు ఎక్కువ అయ్యాయని తెలిపారు.

కానీ ఎవరికీ టికెట్ లు ఇవ్వాలన్నది మాత్రం సర్వే ల ప్రకారమే నిర్ణయాలు ఉంటాయని క్లియర్ గా చెప్పడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news