బీజేపీ దూకుడు… గ్రేటర్ జనాలకు డబుల్ హామీ!

-

దుబ్బాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇచ్చిన ఉత్సాహమో లేక ఇక దూకుడు తగ్గించేది లేదని ఫిక్సయిన తత్వమో తెలియదు కానీ… గతకొన్ని రోజులుగా తెలంగాణలో బీజేపీ కాస్త దూకుడు ప్రదర్శిస్తుంది.. ఇంకా గట్టిగా మాట్లాడితే… గ్రేటర్ లో పాగా వేయడాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుని హామీల వరాలు కురిపిస్తుంది!

ఇటీవల భారీ వర్షానికి రోడ్లు, బస్తీలు, కాలనీలు, అపార్ట్‌ మెంట్లు మునిగిపోవడం.. అందులో పేదలు విపరీతంగా నష్టపోవడం.. ఆ నష్టం ప్రతి కుటుంబానికి సరాసరిన రూ.40వేల నుంచి 50వేల వరకు ఉండటం తెలిసిందే! అయితే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు చెల్లించడం ఒకెత్తు అయితే… ఆ పదివేలలో మళ్లీ తెరాస నాయకులు కక్కుర్తి పడటం సంచనంగా మారింది! ఈ పరిస్థితుల్లో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తే… కచ్చితంగా గ్రేటర్ వాసులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి తీరుతామని చెబుతున్నారు కిషన్ రెడ్డి!

ఐదేళ్లక్రితం మున్సిపల్‌ ఎన్నికల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ డబుల్‌ బెడ్ ‌రూం ఇళ్లు ఇస్తామని ప్రకటించి ఓట్లు గడించిన తెరాస ప్రభుత్వం.. ఏ ఒక్కరికీ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇవ్వలేదని మొదలుపెట్టిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ ‌రెడ్డి.. రాబోయే గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీకి మేయర్‌ పీఠం కట్టబెడితే హైదరాబాద్‌ లో నివాసం ఉంటున్న ప్రజలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని.. కేసీఆర్ లాగా తాము మాటతప్పని చెబుతున్నారు!

గ్రేటర్‌ పరిధిలో సుమారు 18లక్షల మంది డబుల్‌ బెడ్ ‌రూం ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా.. మరో 18లక్షలమంది ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి.. ఈ సమయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పేదలకు ఎన్నిఇళ్లు కట్టిస్తే అన్ని ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు ఇప్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి! మరి ఈ హామీ గ్రేటర్ జనాల్లో ఎంతవరకూ వెళ్తుంది.. ఎంత బలంగా వెళ్తుంది.. దాన్ని గ్రేటర్ వాసులు ఎంత నమ్మకంతో నమ్ముతారు అనేది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news