ప్రజాపాలన దరఖాస్తులలో భారీ స్కాం జరిగినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ నగరంలో ఈ స్కాం బయటకు వచ్చిందని తెలుస్తోంది. ప్రజాపాలన దరఖాస్తులను సమర్పించిన పేదలను మోసం చేశారట కొందరు జీహెచ్ఎంసీలోని అవినీతి అధికారులు. స్వీకరించిన దరఖాస్తులను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయకపోవడమే అందుకు నిదర్శనం అని సమాచారం అందుతోంది.
ఏజెన్సీలతో చేతులు కలిపి ఈ ప్రక్రియను నిధుల దోపిడీ తంతుగా మార్చారని సమాచారం అందుతోంది. లక్షలో దాదాపు 40వేల దరఖాస్తుల వివరాలను కంప్యూటర్లలో నమోదుచేయలేదు. ఆయా ఏజెన్సీలవారికి బిల్లులను మాత్రం లక్ష దరఖాస్తులకు చెల్లించారట. ఇలా నగరం మొత్తంగా రూ.12 కోట్ల ప్రజాధనం వెచ్చించారట. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.