రేవంత్ కు ఎదురుదెబ్బ..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా. .?

-

రేవంత్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారట. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు.

ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం ఉదయం నుంచే జీవన్‌రెడ్డి ఇంటికి పార్టీ నాయకులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.

కాగా కరీంనగర్‌ జిల్లాలో బీఆర్ఎస్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్‌ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో సీఎం సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం చేరిక షాక్ నుంచి తెరుకోక ముందే సంజయ్ మరో షాక్ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సంజయ్ కూడా హస్తం గూటికి చేరడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news