మోడీ బహిరంగ సభకు “విజయ సంకల్ప సభ”గా నామకరణం చేసినట్లు బిజెపి ఎంపి లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణ గడ్డ మీద భాగ్యనగర్ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయని… బిజెపి అగ్ర నాయకత్వం హాజరు అవుతున్న ఈ మీటింగ్స్ చారిత్రాత్మక సమావేశాలు అని తెలిపారు. 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి…మోడీ బహిరంగ సభకు విజయ సంకల్ప సభ గా పేరు పెట్టామని ప్రకటించారు.
అధర్మం పైన ధర్మం గెలుపు కోసం… కుటుంబ, అవినీతి పాలన కు వ్యతిరేకంగా పోరాడుతున్న బిజెపి కు ప్రజలు మద్దతు ఇస్తారనే ఈ సంకల్ప సభ అని చెప్పారు. తెలంగాణ కోసం అమరులు అయిన వారి కన్న కలలు నెరవేరుస్తామని చేపెండుకు సంకల్ప సభ అని… కిరాయి రాజకీయ బ్రోకర్ల ను నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నారు…. ఫ్లెక్సీ రాజకీయాలు చేసే స్థాయికి కెసిఆర్ దిగిపోయారని మండిపడ్డారు. పుత్ర వాత్సల్యం తో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారని… స్వచ,సమర్థ, నీతి వంతమైనా పాలన ను తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వివిధ కమ్యూనిటీ లకు చెందిన 16 సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు బిజెపి ఎంపి లక్ష్మణ్.