లుక్ ఔట్ నోటీసులపై బిజెపి నేత రామచంద్ర రావు ఫైర్

-

లుక్ ఔట్ నోటీసులు ఇచ్చినట్లు తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో రావడంపై ఫైర్ అయ్యారు బిజెపి నేత రామచందర్ రావు. టిఆర్ఎస్ నేత వై.సతీష్ రెడ్డి నోటీసులు ఇచ్చారని ఎలా ఫేక్ ప్రచారం చేస్తారు ? అని ప్రశ్నించారు. దీనిపై ఆయన వెంటనే క్షమాపణలు చెప్పకపోతే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

“ఇన్విస్టిగేషన్ ఎలా సాగుతోంది.. లీకులు ఎలా ఇస్తున్నారు.. సిట్ అధికారులు దీన్ని ఖండించాలి. న్యూస్ ఎలా లీక్ అయ్యింది ? మీడియాకు తప్పుడు వార్తలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు. న్యాయం కోసం కోర్ట్ కు వెళ్లడం మా హక్కు అన్నారు రామచందర్ రావు. వై.సతీష్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డిపై సిట్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వీరు బిజేపీ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. లుక్ ఔట్ నోటీసులు ఎవరికి ఇవ్వాలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ ఉన్నాయని.. ప్రజా జీవితం లో ఉన్న వారికి లుక్ ఔట్ నోటీస్ లు ఇవ్వడం ఏంటి? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news