ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు ఈరోజే నోటిఫికేషన్ వెలువడనుంది. అనంతరం నామపత్రాల స్వీకరణ షురూ అవుతుంది. అయితే మొదటి రోజు మంచి రోజు కావడం ఇవాళ చాలా మంది అభ్యర్థులు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీలోని కీలక నేతలు ఈరోజు నామపత్రాలు దాఖలు చేయనున్నారు.
నేడు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మెదక్ అభ్యర్థి రఘునందన్, మహబూబ్నగర్ అభ్యర్థి డి.కె.అరుణ నామినేషన్ వేయనున్నeరు. ఉదయం 11 గంటలకు మేడ్చల్ కలెక్టరేట్‌లో ఈటల నామినేషన్ వేయనుండగా.. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హర్‌దీప్‌సింగ్ పురి హాజరుకానున్నారు. మరోవైపు రఘునందన్ నామినేషన్ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి, గోవా సీఎం సావంత్ పాల్గొననున్నారు. డి.కె.అరుణ నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొంటారని పార్టీ నేతలు తెలిపారు. వీరితో పాటు మరికొంత మంది నాయకులు కూాడా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.