అప్పుడు కేసు పెట్టి.. ఇప్పుడు నాది కాదంటే ఎలా KTR..?

-

జన్వాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్ పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక కామెంట్స్ చేసారు. ఇప్పటి సీఎం అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పోతే డ్రోన్లు ఎగురవేశారని కేసులు పెట్టారు. కానీ ఇప్పుడెందుకు KTR సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఆ రోజే ఫామ్ హౌస్ నాది కాదని KTR చెబితే అయిపోవు కదా. అప్పుడు కేసు పెట్టి.. ఇప్పుడు ఇతరుల పేరు పైకి మార్చి నాది కాదు అంటే ఎలా KTR అని అని రఘునందన్ రావు అన్నారు.

అలాగే హైడ్రా పేరిట ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయకండి అని కూడా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ ప్రకారం ఎవరు కట్టినా 24 గంటల్లో కూల్చివేయండి. చెరువులు, కాలువలకు అడ్డంగా కడితే ఏమవుతుందో వయనాడ్ ఘటనే ఉదాహరణ. రాజకీయ కక్ష కోసం హైడ్రా వాడొద్దు. అలాగే అధికార పార్టీ నుంచే ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలవ్వాలి అని రఘునందన్ రావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news