బీజేపీ తెలుగు వెర్షన్ మేనిఫెస్టోను విడుదల చేసింది టీబీజేపీ.తెలుగు వెర్షన్ మేనిఫెస్టోను రిలీజ్ చేసారు కిషన్ రెడ్డి, లక్ష్మణ్. ఈ సందర్భంగా ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ….పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రెండు జాతీయ పార్టీలు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలు చూస్తే ప్రజలు అర్థం అవుతుంది..కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన న్యాయ పత్రం విభజన రాజకీయాలు చేస్తున్నట్లు తెలుస్తుందన్నారు.
కానీ బీజేపీ సంకల్ప పత్రం చూస్తే వికసిత భారత్ కనిపిస్తుంది…గత upa ప్రభుత్వాన్నీ చూసిన ప్రజలు మోది గారికి అవకాశం ఇచ్చారని చెప్పారు.గత పదేళ్లుగా మోది ప్రభుత్వం ఎలా పని చేసిందో ప్రజలు చూసారు..
Upa గతంలో ఎన్నో కుంభకోణాలు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇప్పుడు అదే upa కూటమి పేరు మార్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డారు..ప్రభుత్వం ఆస్తులను వారు ఎలా దోచుకున్నారో ప్రజలకు తెలుసు అంటూ పేర్కొన్నారు.న్యాయ పత్రం బ్రిటీష్ యొక్క వారసత్వం గుర్తు చేస్తుంది..విభజించి పాలించే విధానాలు అందులో ఉన్నాయన్నారు.