మోడీ లేని ఇండియాని ఊహించుకోలేం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు బీజేపీ తెలుగు వెర్షన్ మేనిఫెస్టోను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అనేక సమస్యలను మోడీ పరిష్కరించారని.. అందుకే నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి, దేశ భవిష్యత్‌కు అవసరం పేర్కొన్నారు.

మోడీ లేని ఇండియాని ఊహించుకోలేమన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని.. మోడీ మూడోసారి ఇండియా ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.కాగా, వచ్చే లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. హాట్రిక్ విజయమే లక్ష్యంగా ప్రజాకర్శక మేనిఫెస్టో రూపొందించిన బీజేపీ.. ఇందులో ప్రధానంగా 14 హామీలు అమలు చేస్తామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news