కేసీఆర్ సర్కారు కుప్పకూలే రోజులు దగ్గర పడ్డాయి – విజయశాంతి

-

 

సీఎం కేసీఆర్ పై విజయశాంతి సీరియస్ అయ్యారు. “తహసిల్దార్ గారు, నాకు మరణించేందుకు అనుమతివ్వండి…” అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ పెట్టి మరీ అభ్యర్థిస్తున్న ఈయన మాజీ మావోయిస్ట్ కొడెం సమ్మయ్య (అలియాస్) చంద్రన్న అని పేర్కొన్నారు.

 

ప్రభుత్వం పిలుపుతో నక్సల్ ఉద్యమాన్ని విడిచి జనజీవన స్రవంతిలో భాగమైన సమ్మయ్య… తన భూమిని బీఆరెస్ నేత ఆక్రమించుకోగా ఆ బాధతోనే తన భార్య మరణించిందని కూడా చెప్పారు. ఇలా ఒక్క సమ్మయ్య మాత్రమే కాదు…. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి బాధితులు అడుగడుగునా అధికార బీఆరెస్ పార్టీ నాయకుల కబ్జాకోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు అని అన్నారు.

 

 

మరోవైపు లోపాల పుట్టగా మారిన ధరణి పోర్టల్ కూడా దురాశాపరులైన ఈ నాయకులకు తోడుగా నిలబడింది. లంచాలు మింగి పట్టాల్లో పేర్లు మార్చేస్తున్న పలువురు అధికారుల తీరుతో బాధితుల కడుపు మండిపోతోంది. మ్యూటేషన్ కాని భూములకు డబుల్ రిజిస్ట్రేషన్, ఒకే భూమిని ఇద్దరి పేరిట రిజిస్టర్ చెయ్యడం, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండానే విరాసత్ చెయ్యడం, రిజిస్టర్ అయినప్పటికీ మ్యూటేషన్ కాని భూముల యజమానులుగా ధరణిలో పాత యజమానుల పేర్లే కనిపించడం, సాదా బైనామాల సమస్యలు…. ఇలా దేశంలో భూములకు సంబంధించి మరెక్కడా లేని సమస్యల సుడిగుండంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేశారు. ఈ ఒక్క సమస్యపైనే ఎన్నో ఆత్మహత్యలు, ఆత్మహత్యా యత్నాలు జరుగుతూ బాధితులు శాపనార్థాలు పెడుతున్నా లెక్కలేనితనంతో వ్యవహరిస్తోన్న కేసీఆర్ గారి సర్కారు కుప్పకూలే రోజులు దగ్గరలోనే ఉన్నాయనీ హెచ్చరించారు విజయశాంతి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news