గత కొద్ది రోజులుగా టమాటాల ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు రూ.10 ఉన్న ధర ఇప్పుడు ఏకంగా రూ.250 దాటింది. చాలా ప్రాంతాల్లో కిలో టమాట ధర రూ.150 నుంచి రూ.200 మధ్య ఉంది. అయితే సామాన్యులను ఇబ్బంది పెడుతున్న ఈ టమాట ధరలపై సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వస్తున్నాయి. ఇక ఇటు, మార్కెట్లో బోడకాకరకు డిమాండ్ పెరిగింది.
ఇప్పుడిప్పుడే పంట మార్కెట్లకు వస్తుండటంతో వరంగల్ మార్కెట్లో కిలో రూ. 400 పలుకుతోంది. ఏటా వర్షాకాలం రెండు, మూడు నెలలు అందుబాటులో ఉండే బోడకాకర రుచితో పాటు ఆరోగ్యానికి ఉపయోగకరం కావడంతో కథలు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు అడవుల్లో మాత్రమే అధికంగా లభించే బోడకాకర ఇప్పుడు పలు ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు.