తెలంగాణ రైతులకు కాంగ్రెస్ మరోసారి షాక్ ఇచ్చింది. రైతుబంధు ఇస్తానన్న రేవంత్ రెడ్డి… మళ్లీ రైతుల కొంప ముంచాడని తెలుస్తోంది. మొన్నటి వరకు మార్చి 31వ తేదీ వరకు రైతుబంధు నిధులను రిలీజ్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.

దీంతో ఇవాల్టి నుంచి ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమలులోకి వస్తుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తే… ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నడవవు. అంటే ఈ లెక్కన… రేవంత్ రెడ్డి ప్రభుత్వం… రైతుబంధుకు ఎగనామం పెట్టినట్టే..! దీంతో తెలంగాణ రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు… రిలీజ్ చేయకుండా రైతులతో రేవంత్ రెడ్డి ఆటలాడుకుంటున్నాడని ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని ఆందోళన చెందుతున్నారు రైతులు.