గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కవిత నిన్న అరెస్టు అయిన సంగతి తెలిసిందే. లిక్కర్ స్కామ్ లో భాగంగా కొన్ని ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈడి అధికారులు కవితాను అరెస్టు చేశారు. అయితే ఎమ్మెల్సీ కవిత అరెస్టు ను నిరసిస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ ఆందోళనలు నిర్వహించనుంది.

బిజెపి పార్టీ రాజకీయ దురుద్దేశంతోనే తమ ఎమ్మెల్సీని అరెస్టు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు హరీష్ రావు. దీంతో ఇవాళ గులాబీ పార్టీ నేతలు అందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపనున్నారు.