2018 ఎన్నికల సమయంలో తెలంగాణ రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రుణమాఫీని నాలుగు విడతల్లో ప్రభుత్వం మాఫీ చేస్తోందని గతంలో తెలిపింది. అందులో భాగంగా ఇప్పటివరకు రెండు విడతలలో రుణమాఫీ చేశారు. 2020లో 25వేల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేసిందిి ప్రభుత్వం. మరోసారి 25వేల నుంచి 50 వేల వరకు ఉన్నారు రుణాన్ని 2021 ఆగస్టులో మాఫీ చేస్తున్నట్లుు ప్రకటించారు.
కానీ అందులో కొంతమంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. తాజాగా సెప్టెంబర్ 17 న మరోసారి రైతు రుణమాఫీ చేయనున్నట్లు సమాచారం. రుణమాఫీ పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రూ. 1 లక్ష లోపు ఋణం ఉన్న రైతులకు ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేయనుందని సమాచారం.