సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు

-

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ పై వారి ప్రభుత్వంలో చేసిన తప్పిదాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలోనే ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ వద్దకు వచ్చారని.. అయినా సీఎం కేసీఆర్ పట్టించుకోలేదని.. రండా.. అని వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఇరు పార్టీల నేతలకు వివాదంగా మారాయి.

తాజాగా మంచిర్యాలలో బీఆర్ఎస్ నేతల సమావేశంలో మాజీ ఎంపీ,  ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుపడ్డాడు. కాంగ్రెస్ హయాంలోనే రాష్ట్రం నాశనమైందని తెలిపారు. అరె రేవంత్ రెడ్డి..  నువ్వు మగాడివారా..? నువ్వు ఏం చేశావురా..? మేము  రైతులకు మేలు చేయాలనుకున్నాం.  ఈ సమావేశంలో సహనం కోల్పోయి.. పలు పరుశ పదాలను వాడారు. ముఖ్యమంత్రి హోదాను మరిచి రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానని.. సంస్కారం అడ్డువస్తుందని ఆగానని పేర్కొన్నారు. బాల్కసుమన్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఇఫ్పుడు పెనుదుమారాన్నే రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news