తెలంగాణ ఆర్థిక మరియు వైద్యశాఖ మంత్రి హరీష్ రావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నిత్యం జనాల్లో ఉంటూ… ప్రజల కోసం పనిచేస్తారు మంత్రి హరీష్ రావు. ఆయన ఏది చేసినా ప్రజల కోసమే అన్నట్లుగా ఉంటుంది. కష్టం వచ్చిందంటే.. హరీష్ అన్న అండగా ఉన్నాడంటూ కార్యకర్తలు గాని ప్రజలు గాని ఆయన ఇంటికి చేరుతూ ఉంటారు.
అయితే ఇది ఇలా ఉండగా తాజాగా మంత్రి హరీష్ రావు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మంత్రి హరీష్ రావు ‘చెత్త తొలగిద్ధం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిద్దిపేటలోని 18వ వార్డులోని ఓ మురికి కాలువలో చెత్త పేరుకుపోవడంతో కవర్లు, పేపర్లు, ప్లాస్టిక్ బాటిల్లను స్వయంగా చేత్తో బయటకు తీశారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, దీనివల్ల దోమలు రాకుండా ఉంటాయని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంతో పాటు శుభ్రమైన ఆహారం తీసుకోవాలన్నారు.
డ్రైనేజీలో చెత్త తీసి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మంత్రి హరీష్ రావు. pic.twitter.com/aijE5uQJAY
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2023