సీఎం కేసీఆర్ షాక్… మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత మండవ వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో చేరనున్నట్లు సమాచారం. ఇవాళ లేదా రేపు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకొనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మండవ కాంగ్రెస్ లో చేరితే ఆయనకు నిజామాబాద్ రూరల్ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోందట.

ఇక అటు బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరనున్నారు బాలసాని లక్ష్మీనారాయణ.. తుమ్ముల, పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు బాలసాని. నా ఆత్మభిమానం దెబ్బతిన్నది…..నన్ను చాలా సార్లు అవమానించారన్నారు బాలసాని. అధిష్టానం కు చెప్పుకుంటే పట్టించుకోలేదు…..నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు భరించానని వెల్లడించారు బాలసాని. అధికార మదం తో BRS నాయకులు ప్రవర్తించారు… మావోయిస్టు ప్రాంతంలో కష్టపడి పనిచేశానన్నారు.