BRS leader Peddi Sudarshan Reddy under house arrest: నర్సంపేటలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హౌజ్ అరెస్ట్ అయ్యారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కాసేపటి క్రితమే హౌస్ అరెస్ట్ అయ్యారు. నర్సంపేట జిల్లా ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వస్తున్న మంత్రులను అడ్డుకుంటారనే నెపంతో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హౌస్ ఆరెస్ట్ చేశారు పోలీసులు.

ఇది ఇలా ఉండగా, నర్సంపేట కు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ హెలికాప్టర్ లో చేరుకున్నారు. ఈ సందర్భంగా నర్సంపేట మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులకు ఘన స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 50 సీట్లతో ఈ ఏడాది ప్రారంభం అవుతున్న మెడికల్ కాలేజీ బిల్డింగులను ప్రారంభించారు మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ.