కాశ్మీర్ లో 50వేల మంది డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి స్కూళ్లకు రప్పించాం ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. తాజాగా శ్రీనగర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాశ్మీర్ ను దోచుకోవడం తమ జన్మహక్కు అన్నట్టు ఆ మూడు కుటుంబాలు ప్రవర్తించాయి. కాశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లు కాదు.. బుక్స్, పెన్సు కనిపిస్తున్నాయి. కాశ్మీర్ లో ఉపాధి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎయిమ్స్, ఐఐటి వంటి వార్తలు ఇప్పుడు కాశ్మీర్ లో వినిపిస్తున్నాయి. గతంలో లాల్ చౌక్ దగ్గర ఉగ్రదాడులు జరిగేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
50వేల మంది డ్రాప్ అవుట్ విద్యార్తులను తిరిగి స్కూల్లకు రప్పించాం. మూడు కుటుంబాలు జమ్మూ కాశ్మీర్ ను దోచుకున్నాయి. స్కూళ్లను కూడా ఉగ్రవాదులు టార్గెట్ చేశారంటే.. వారు ఎంత ద్వేషంతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు పార్టీలు విద్యార్థుల చేతికి రాళ్లు ఇచ్చేవి. తొలివిడత ఎన్నికల్లో కాశ్మీర్ ప్రజలు ఉత్సాహంగా ఓటు వేశారు.