తెలంగాణ చరిత్రను మరుగున పడవేసేందుకు రేవంత్‌ కుట్ర చేస్తున్నారు : వినోద్ కుమార్

-

కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాల్లో మిషన్ కాకతీయ గొప్ప పథకం అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. మిషన్‌ కాకతీయ పథకం చేపట్టాక చెరువులు గండిపడటం తగ్గిపోయిందని తెలిపారు. తెలంగాణకు గర్వకారణంగా నిలిచే చార్మినార్‌ వంటి కొన్ని అరుదైన కట్టడాలు ఉన్నాయని వివరించారు. ఇలా కేసీఆర్ పాలనలో తెలంగాణ సంస్కృతికి, చరిత్రకు ఎంతో విలువనిచ్చామని, రాబోయే తరాలు ఈ చరిత్రను తెలుసుకనేందుకు వీలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు.

అయితే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం తెలంగాణ చరిత్ర ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తోందని వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన ఆయన.. తెలంగాణ చరిత్రను మరుగున పడవేసే కుట్రను రేవంత్‌ రెడ్డి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. కాకతీయుల పాలనను మరిపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మన జాతీయ చిహ్నంలో అశోక స్థూపాన్ని తీసుకున్నామన్న వినోద్ కుమార్ అశోకుడు ఆనాడు దేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తి అని పేర్కొన్నారు. రాచరిక చిహ్నం అని సారనాథ్ స్థూపాన్ని మనం విస్మరించామా? అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news