Propose Day : మీ ప్రియమైన వారికి ఎలా ప్రపోజ్ చేస్తే యాసేప్ట్ చేస్తారంటే?

-

వాలంటైన్స్ డే వీక్ స్టార్ట్ అయ్యింది.. ప్రేమికులకు ప్రతి రోజు ఒక తియ్యటి అనుభూతి, చాలా ప్రత్యేకమైనది అని చెప్పాలి..రోజ్ డే అయిపొయింది.. ఇప్పుడు ప్రపోజ్ డే..అందంగా ఉంటే ఎవరైనా ప్రపోజ్ చేస్తారు.. కానీ మన మనసులోని ప్రేమను, ఎప్పటి నుంచో దాచుకున్న ప్రేమను ఈరోజు ఎలాగైనా బయట పెట్టాలని అనుకునేవాళ్లు ఎలా చెయ్యాలని అనుకుంటారు. మాటల రూపంలో చెప్పడం అంత ఈజీ కాదు. అది కూడా.. ఇష్టమైన వారు ఎదురుగా నిలబడి ఉంటే.. ప్రేమించిన వారికి మన ప్రేమను తెలపడమంటే కాస్త కష్టమే. ఎన్నో సందేహాలు.. భయంతో మాటలు రావు. అందుకే.. ఎలాంటి హైరానా పడకుండా సింపుల్ కొటేషన్స్ లను వాడి ప్రపోజ్ చేయ్యండి…

మనసుకు నచ్చిన వారికి ఎలా ప్రేమను తెలపాలి అనుకొనేవారికి ఇది మంచి సమయం..సమయం వృథా చేయకుండా.. మనసుకు నచ్చిన వ్యక్తికి ప్రపోజ్ చేసేయండి. ఎందుకంటే ప్రపోజ్ డే రోజున ప్రపోజ్ చేసే వాళ్లు ఒప్పుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకోసం స్వయంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇవ్వొచ్చు. కార్డ్‌లో మీ స్వంత ప్రేమపూర్వక పదాలను రాయడం ద్వారా ఐ లవ్ యూ చెప్పి వారి మనసు గెలుచుకోవచ్చు..

ఇక అంతేకాదు కాస్త రొమాంటిక్ గా మోకాళ్ళ మీద కూర్చొని నచ్చిన బహుమతిని ఇవ్వడం కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుంది. కవిత్వం పాడటం, రొమాంటిక్ పాటలు, గిటార్ వాయించడం ద్వారా కూడా ప్రపోజ్ చేయవచ్చు. వీటితో పాటు ప్రేమపూర్వక మెసేజ్ ల ద్వారా కూడా ప్రపోజ్ చెయ్యొచ్చు.మనసులో ఉన్న ప్రేమను చెప్పడానికి క్షణం చాలు, కానీ నిజమని చెప్పడానికి జీవిత కాలం అయినా సరిపోదు.. ఇలాంటి లవ్ మెసేజ్ లతో కూడా ప్రపోజ్ చెయ్యొచ్చు..టెన్షన్ పడకుండా ఒప్పో.. తప్పో మనసులో మాట నిజాయితీగా చెప్పడం చాలు..వారికదే మర్చిపోలేని గిఫ్ట్ అవుతుంది..ఎంజాయ్ చెయ్యండి.. హ్యాపీ ప్రపోజ్ డే..

Read more RELATED
Recommended to you

Latest news