చెరువుల కబ్జా వెనక బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉంది – NVSS ప్రభాకర్

-

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలమైందన్నారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వానికి దూరదృష్టి లోపించిందని ఆరోపించారు. వర్షపాతం పెరిగిపోతున్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయడం లేదన్నారు. హైదరాబాద్ ను డల్లాస్, సింగపూర్ చేస్తానని కేసీఆర్ గొప్పలు చెప్పారని.. హైదరాబాద్ లో మిషన్ కాకతీయ ఏమైంది కేసీఆర్..! అని ప్రశ్నించారు.

హైదరాబాద్ లోని 3 వందల చెరువుల్లో పూడిక తీస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరిగేదన్నారు. ప్రభుత్వం ఒక్క చెరువు పూడిక తియ్యలేదు.. ఆక్రమణలను పట్టించుకోలేదన్నారు. చెరువుల కబ్జా వెనకాల భారాస నేతల ప్రమేయం ఉందన్నారు ప్రభాకర్. కబ్జాల వల్ల చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు బస్తీల్లో ఉంటున్నాయన్నారు. నగరం మునిగిపోవడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. నగరంలో మ్యాన్ హోల్ మరణాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు.

వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే భారాస నాయకులు కేటిఆర్ ప్లెక్సీలు, కేక్ కట్ చేస్తూ హంగామా చేశారని ఆరోపించారు. వరద నష్టం,తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ముఖ్యమంత్రి తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా కేటీఆర్ పర్యటించడం కాదు.. నైతిక బాధ్యత వహించాలన్నారు. రాజకీయాలు మానేసి ఈ ఐదు నెలలైనా ప్రజా సమస్యల కొరకు పనిచేయాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news