గ్రేటర్‌ కారులో మాజీ తమ్ముళ్ళకు తిరుగులేదట.!

-

అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో ఎంతమంది మాజీ తమ్ముళ్ళు ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. సగానికి సగం మంది టి‌డి‌పి నుంచి వచ్చినవారే. ఆఖరికి సి‌ఎం కే‌సి‌ఆర్ సైతం ఆ టి‌డి‌పి నుంచి వచ్చినవారే. ఇక బి‌ఆర్‌ఎస్ విజయవంతంగా దూసుకెళ్లడానికి టి‌డి‌పి సగం కారణమని చెప్పుకోవచ్చు. ఇక బి‌ఆర్‌ఎస్ లో సగం వరకు టి‌డి‌పి నుంచి వెళ్ళిన వారే ఉన్నారు. అందులో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా చాలామంది ఉన్నారు.

బి‌ఆర్‌ఎస్ పార్టీ
బి‌ఆర్‌ఎస్ పార్టీ

అయితే బి‌ఆర్‌ఎస్ విజయానికి మాజీ తెలుగు తమ్ముళ్లే ఎక్కువ కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో బి‌ఆర్‌ఎస్ హవా కొనసాగడానికి మాజీ తమ్ముళ్లే కారణం. గత రెండు ఎన్నికల్లో గ్రేటర్ లో బి‌ఆర్‌ఎస్ హవా నడుస్తుంది. ఈ సారి కూడా బి‌ఆర్‌ఎస్ హవా నడవాలని చెప్పి మాజీ తమ్ముళ్ళు కష్టపడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో మాజీ తమ్ముళ్ళు మళ్ళీ గెలిచేలా ఉన్నారు.

పలువురు గెలుపు బాట పట్టడం ఖాయమని చెప్పవచ్చు. మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్..గతంలో టి‌డి‌పిలోనే కీలకంగా పనిచేశారు. సనత్‌నగర్ లో ఈయన మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇక మేడ్చల్లో మంత్రి మల్లారెడ్డికి తిరుగులేదని తెలుస్తుంది. ఇటు కూకట్‌పల్లిలో మాధవరం కృష్ణారావు మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొడతారని అంటున్నారు. అటు జూబ్లీహిల్స్ లో మాగంటి గోపినాథ్ కూడా విజయం సాధించేలా ఉన్నారు. కుత్బుల్లాపూర్ లో వివేకానంద గౌడ, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ..వీరు కూడా హ్యాట్రిక్ ఫిక్స్ అంటున్నారు.

అటు రాజేంద్రనగర్‌లో ప్రకాష్ గౌడ్ విజయానికి ఢోకా లేదని అంటున్నారు. మల్కాజిగిరిలో మైనంపల్లి హనుమంతరావుకు ఎదురులేదని సర్వేలు చెబుతున్నాయి. వీరంతా గతంలో టి‌డి‌పిలో పనిచేసినవారే..ఇప్పుడు బి‌ఆర్‌ఎస్ విజయం కోసం తమవంతు సాయం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news