ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో టెన్షన్ నెలకొంది. అలాగే సీట్ల పంపకాలపై చర్చలు నడుస్తున్నాయి. ఇక గెలుపు అవకాశం ఉందనుకునే పార్టీలో సీట్ల కోసం పోటీ నెలకొంది. ముఖ్యంగా వైసీపీ, టిడిపిల్లో సీట్ల కోసం పోటీ ఎక్కువ ఉంది. ఒకే సీటు కోసం ఇద్దరు, ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. దీని వల్ల ఆధిపత్య పోరు నడుస్తుంది. దీనికి చెక్ పెట్టి నాయకులకు సీట్ల పంపకాలపై జగన్, చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు.
అయితే ఆ రెండు పార్టీల్లోనే కాదు జనసేనలో కూడా సీటు కోసం నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ఆ పార్టీలో కూడా పోరు కనిపిస్తుంది. వాస్తవానికి రాష్ట్రంలోని 175 సీట్లలో జనసేనకు బలం లేదు. గట్టిగా చూసుకుంటే ఓ 30 సీట్లలో బలం ఉంటుంది. అలా అని ఆ సీట్లలో గెలిచే బలం పెద్దగా లేదు. కాకపోతే టిడిపితో పొత్తు ఉంటే ఆ సీట్లని దక్కించుకుంటే గెలుపు ఈజీ అని జనసేన నేతలు భావిస్తున్నారు. అందుకే జనసేనకు పట్టున్న సీట్లలో పోటీ ఎక్కువ ఉంది.
ఈ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో సీటు కోసం పోటీ ఎక్కువ ఉంది. అయితే పవన్ ఇప్పటికే కొన్ని సీట్లలో క్లారిటీ ఇచ్చారు. కానీ కొందరు నేతలు టిడిపితో పొత్తు దృష్టిలో పెట్టుకుని సీటు దక్కించుకోవాలని పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే రాజానగరం సీటులో ఇప్పటికే పలువురు నేతలు పోటీ పడుతున్నారు. అటు పిఠాపురం కోసం కూడా పోటీ ఎక్కువగానే ఉంది.
అయితే రాయలసీమలో జనసేనకు బలం పెద్దగా లేదు. ఆ పార్టీకి బలమున్న ఏకైక స్థానం తిరుపతి. ఈ సీటు కోసం గట్టి పోటీ ఉంది. 2009లో ఇక్కడ ప్రజారాజ్యం నుంచి చిరంజీవి గెలిచారు. కానీ 2019లో ఇక్కడ జనసేనకు 12 వేల ఓట్లే పడ్డాయి. అయినా సరే పొత్తులో భాగంగా ఈ సీటు దక్కించుకోవాలని జనసేన చూస్తుంది. టిడిపితో పొత్తు ఉంటే ఈ సీటుని గెలుచుకోవచ్చు అని భావిస్తున్నారు. ఇక ఈ సీటు కోసం కిరణ్ రాయల్, పసుపులేటి హరిప్రసాద్ పోటీ పడుతున్నారు. ఎవరికి వారికి సెపరేట్ బలం ఉంది. పోటీ కాస్త ఆధిపత్య పోరుగా మారుతుంది. దీని వల్ల జనసేనకే నష్టం. కాబట్టి ఈ సీటుని పవన్ త్వరగా తేలిస్తే బెటర్.