ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ కి టికెట్ ఇవ్వకూడదు : బీఆర్ఎస్ నేతలు 

-

నల్గొండ జిల్లాలోని దేవరకొండ అసెంబ్లీ నియోజవర్గంలో అధికార పార్టీ నాయకుల్లో ఎమ్మెల్యేపై అసమ్మతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా దేవరకొండ సిట్టింగ్ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదని నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల నాయకులు ఇవాళ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి విన్నవించారు. 

దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ రవీంద్ర కుమార్ కి ఇస్తే దేవరకొండలో బీఆర్ఎస్ కి ఓటమి తప్పదని వివరించారు. ఈ సందర్బంగా దేవరకొండ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పై వ్యతిరేకత చాలా ఉందని తెలిపారు. అయితే నియోజకవర్గంలో కార్యకర్తలు, నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్యా దేవెందర్ నాయక్ కి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. దేవేందర్ నాయక్ కి టికెట్ ఇవ్వకుంటే దేవరకొండలో టీఆర్ఎస్ గెలవదని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలునాయక్ గెలిచే అవకాశాలున్నట్టు మంత్రి హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రావుల దృష్టికి తీసుకెళ్లారు. సీఎంతో మాట్లాడి.. మరోసారి నియోజకవర్గంలో సర్వే చేయిస్తామని పల్లా రాజేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చినట్టు సమాచారం.  

Read more RELATED
Recommended to you

Latest news