ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. సీఎం జగన్ సహాయం

-

అమెరికా నుంచి 21 మంది భారతీయ విద్యార్థులను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. అయితే యూఎస్ యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొంది, వీసాలను సాధించి.. ఎన్నో ఆశలతో అమెరెకాలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులకు ఈ పరిణామాలు షాక్ ఇచ్చాయి. అమెరికా నుంచి తిప్పి పంపిన వారిలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు.

సరైన డాక్యుమెంట్స్ లేవని.. కనీసం వివరణ కూడా ఇవ్వకుండానే వారిని వెనక్కి పంపించడంతో విద్యార్థుల భవిష్యత్ పై వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు తిరిగి రావడం గురించి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన విద్యార్థుల వివరాలను తెలుసుకొని వారికి సహాయం చేయాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. అవసరం అయితే విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరపాలని సూచించారు సీఎం జగన్. అమెరికాలోని అట్లాంట, శాన్ ఫ్రాన్ సిస్కో, షికాగోలలోని యూనివర్సిటీలో చదివించేందుకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఈ చేదు అనుభవం ఎదురైంది.

Read more RELATED
Recommended to you

Latest news