బీజేపీలో చేరనున్న BRS ఎమ్మెల్యే భేతి సుభాష్ !

-

అసెంబ్లీ ఎన్నికలకు ముందు…బీఆర్‌ఎస్‌ పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. హైదరాబాద్ ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బిజెపిలో చేరనున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఢిల్లీలో పార్టీ పెద్దల సమక్షంలో బిజెపిలో జాయిన్ అవుతున్నట్లు తెలిపారు.

BRS MLA Beti Subhash Reddy announced to join BJP

సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న తనకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలంగాణ బిజెపి నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపారు. కాగా, ఇప్పటివరకు ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థిని బిజెపి ప్రకటించలేదు.

ఇక తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ గడ్డం వివేక్ కమలం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్​లో చేరుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని వివేక్ అన్నారు. కేసీఆర్‌ కుటుంబం తమ కుటుంబ ఆకాంక్షల మేరకే పనిచేస్తోందని.. ప్రజా సంక్షేమం ఆ పార్టీకి పట్టడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ను గద్దె దింపాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్‌లో చేరానని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news