రైతులు ఆకలితో కాదు.. ఆత్మహత్య చేసుకుని చావాలి.. నోరుజారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

-

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నారు. ఇప్పటికే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన తాజాగా మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడూ.. నోరు జారడంతో  చిక్కుల్లో పడ్డారు. రైతులు ఆకలితో కాదు.. ఆత్మహత్యలతో చావాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడూ ఆ వ్యాఖ్యలు రాజకీయ దూమారాన్ని రేపుతున్నాయి. ఎమ్మెల్యే తాను చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన రైతుల గురించి మాట్లాడుతూ నోరు జారారు. “ఈ దేశంలో అన్నం పెట్టే రైతన్న ఆకలితో చావద్దు, ఆత్మహత్యలు చేసుకొని చావాలి “అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే మాటలతో అక్కడి నేతలు, ప్రజలు అవాక్కయ్యారు.  వాస్తవానికి.. దేశానికి అన్నం పెట్టే రైతు ఆకలితో చావకూడదని, ఆత్మహత్యలు చేసుకుని చావకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ పలు చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలని భావించాడు. ఈ వీడియో చూస్తే.. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నోరుజారినట్టు అర్థమవుతోంది. ఇప్పుడూ ఎమ్మెల్యే నోరు జారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news