పార్టీ మార్పు పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కీలక ప్రకటన..!

-

పార్టీ మార్పుపై ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవీ రెడ్డి సుధీర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్ సైనికుడినని, తాను పార్టీ మారనని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నానంటూ వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. చివరి వరకు బీఆర్ఎస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. తనే కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారరని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు విశ్లేషించుకుని బలంగా ముందుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు.


నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల సమయమైనా ఇవ్వాలని, ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ప్రతిపక్షంగా పోరాడుతామన్నారు. ఇప్పుడే కాంగ్రెస్ సర్కార్ కూలిపోతుంది అనటం సరికాదు అని అన్నారు. గాయం కారణంగా యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసిఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శిస్తే కొందరు తప్పు పడుతున్నారు. కానీ, అనారోగ్యానికి గురైన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించడం మంచి సంప్రదాయం అన్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎల్బీనగర్ సెగ్మెంట్ నుండి బరిలోకి దిగిన సుధీర్ రెడ్డి సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మధు యాష్కీ గౌడ్ పై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news